Sunday, April 18, 2010

చ్యవనప్రాష్

మనకు జీవితంలో ఎన్నో సంఘటనలు చాలా సాధారణంగా అనిపిస్తాయి కాని ఎప్పుడో ఏదో ఒక రోజున ఎలా ఉపయోగ పడుతాయో మనం గ్రహించలేము 


నేను ఏడవ తరగతి చుడువుతున్నప్పుడు మా తాత వేసవి సెలవులకు మా ఇంటికి వచ్చాడు, నన్ను చూసి ఎంతో మురిసిపోయాడు. నేను చాలా సన్నగా ఉన్నాను అంటూ మా నాన్న దెగ్గర మొర పెట్టాడు. "ఐతె ఏమీ చేయమంటావ్? " అని విసుకున్నాడు మా నాన్న. "పిల్లలకు చ్యవనప్రాష్ మంచిది, బలం వస్తుంది, రుచి కూడా బాగుంటుంది" అని మా తాత మా నాన్నను ఒప్పించాడు. మర్నాడు మా నాన్న ఒక చ్యవనప్రాష్ తెచ్చి ఇంట్లో పెట్టాడు. మా తాత మొహం లో వెయ్యి వాట్ల బల్బు వెలిగింది. 


నాకు రోజు స్కూల్ నించి రావటం తినటం పడుకోవటం అలవాటు. అదే అలవాటు తో ఆ రోజు కూడా త్వరగా పడుకున్న. 
"రాజు, రాజు" అంటూ మా తాత నా దెగ్గరికి వచాడు. 
"ఆ ఏంటి" అని విసుకున్నాను. "ఒరేయ్ కాస్త చ్యవనప్రాష్ తినరా" అని మా తాత స్పూన్ తో పెట్టబోయాడు 
"ఎహే పో" అని మా తాత ని నెట్టేస. "అలా కాదు నాన్న, ఒక్క స్పూన్ తినరా" అంటూ భ్రతిమిలడదు 
."నన్ను నిద్ర పొనేఏఏఏ" అని కేక వెస. ఐతె మా తాత "ఇదిగో చూడు నువ్వు తినక పోతే నేనే తినేస్త" అంటూ బెదిరించాడు. 
"ఆ నువ్వే తిను" అని ముసుకు పెట్టి పడుకున్న. మా తాత మెల్లగా ఒక్క స్పూన్ చ్యవనప్రాష్ నోట్లో వేసుకొని "రేపు చెప్తా నీ పని" అని వెళ్ళిపోయాడు. 


ఇలా కొన్ని రోజులు సాగింది, మా తాత నాకు చ్యవనప్రాష్ తినిపించాలి అని రావటం నేను వద్దు అనటం తను ఒక  స్పూన్ నోట్లో వేసుకోవటం. ఒక్క రోజు చ్యవనప్రాష్  ఐపాయింది, అప్పుడు మా నాన్న దెగ్గరికి వెళ్లి "ఒరేయ్ మోహన, రాజు కి చ్యవనప్రాష్ అయిపొయింది, ఇంకో బోటిల్ తీసుకొనిరా" అని అన్నాడు. అది విని నాకు తిక్క రేగింది, నా పేరు చెప్పుకొని మా తాత చ్యవనప్రాష్  లగించటం ఏంటి అని అనుకున్న. 


మర్నాడు ఒక్క బోటిల్ వచ్చింది నాకు నిద్దర సమయం కూడా వచ్చింది. మా తాత చ్యవనప్రాష్  తీసుకొని వచ్చాడు రాజు రాజు అంటూ. ఈ సారి  వెరైటీ గ "నేను చ్యవనప్రాష్  తింటాను" అని మా తాత దెగ్గర స్పూన్ తీసుకొని తినేస. కాని మా తాత మొహం లో ఏదో ఒక నిరాశ చూసా. తను ఆ రోజు చ్యవనప్రాష్ తినలేదు అనే బాధ తన మొహం లో కనిపించింది. అప్పుడు నాకు అర్థం ఐంది తనకు చ్యవనప్రాష్  అంటే చాల ఇష్టం అని. తను కావాలి అని అడిగితే మా నాన్న చ్యవనప్రాష్  తెస్తాడు కానీ అది చిన్న పిల్లల కోరిక లాగా ఉంటుంది ఏమో అని తను సిగ్గు పది అడగాలేడు అని అనిపించింది. వృద్ధులది పిల్లల మనస్తత్వం అని అంటారు కానీ మనసు పిల్లలదే ఐనా వయసు, అనుభవం వాళ్ళ ప్రవర్తనకు అడ్డు వేస్తుంది. పిల్లల మీద అతి జాగర్త చూపించే మనం పెద్దల పట్ల నిలక్ష్యం ఎందుకు? 


ఆనాటినుంచి నేను ఎప్పుడు మా తాత చ్యవనప్రాష్  ఇచినా వద్దు అనే వాడిని, మా తాత నన్ను బెదిరించినట్టు మభ్య పెట్టి "నువ్వు తినకపోతే చూడు నేనే తినేస్త" అంటూ ఆ చావంప్రాష్ ని ఆస్వాదించేవాడు. 
నేను డిగ్రీ పాస్ అయిన రోజు వెళ్లి మా తాతకు ఆ విషయం చెప్తే, "చూసావా చ్యవనప్రాష్  తిన్నందుకు నీ తెలివి ఎంత పెరిగిందో" అని అన్నాడు. "అవును తాత నిజంగా ఈ రోజు నాకు ఉన్న బుద్ధి చ్యవనప్రాష్  వల్లనే" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయా. 


ఇప్పుడు నేను నా కొడుకు గదిలోకి వెళ్తున్నాను, చ్యవనప్రాష్  తీసుకొని. వాడు ఛీ కొడతాడు అనే నా నమ్మకం, కాని ఈ చ్యవనప్రాష్  వాడికి ఒక సంస్కారం నేర్పుతుంది అనే నా భావన.



2 comments:

  1. Chaalaa baagundandi.But I just wonder how you are able to grasp your taatagaru's feelings just in 7th standard.Good.Keep it up.

    ReplyDelete
  2. emotioins ki vayasu undadu kadandi!

    ReplyDelete