Sunday, April 18, 2010

రాధా కృష్ణ

అద్భుతం! అమోఘం! మన దేశం మన సంస్కృతి-సాంప్రదాయం మీద చూపిస్తున్న శ్రద్ధ పట్ల నాకు అవధులు లేనంత ఆనందం వేస్తుంది. ఎలా అని అనుకుంటున్నారా? గత నెల మన సుప్రీం కోర్టు ఇచిన తీర్పుతో. ఇద్దరు ప్రేమికులు పెళ్ళికాకుండా సంసారం... అదే సహజీవనం చెయ్యవచు అని, దానికి వాళ్ళు తీసుకున్న ఆధారం 'రాధా కృష్ణ' అనుభందం అని తేల్చి చెప్పింది. ఇంకేం మనం మన పురాణాలను అనుసరించటం మొదలు పెట్టాం. ఇంకొన్ని రోజుల్లో భగవద్ గీత, రామాయణం, భారతం లాంటి పురాణాలను కూడా ఆదర్శాలుగా తీసుకొని మన రాజ్యన్గాలను మర్చుకుందాం. ఈ సారి ఎవరిని అనుసరిద్దమబ్బా? ఆ ఒక ఐడియా , మను ధర్మ శాస్త్రంలో మగవాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవోచు అంట, మరి ఇంకేం సెకండ్ సెట్ అప్ పెట్టిన ముద్దుల మొగుల్లకు ఒక మంచి అవకాసం. పదండి సుప్రీం కోర్టుకి మన అర్జీ పెట్టుకుందాం. ఆగండి ఆగండి! మన సమాజంలో ఇంకా ఏ మార్పులు కావాలో ఒక లిస్టు రాస్తా
ఆడవాళ్ళ మీద హత్యాచారం చేసే దుర్యోధనులకు మరణ శిక్ష.
అవినీతి రాజకీయ కంసులకు శిరస్చేదన.
అలాగే షూలదండన, క్రిమిభోజనం, కుంభిపాకం లాంటి శిక్షలు చేకూర్చాలి మరియు ప్రతీ పొలిసు ఒక అపరిచిథుదు అవ్వలి.

నెను వెటకారంగా చెప్పినా ఒక్క సారి ఆలొచించండి మన సామాజిక ధొరని. మనం విఛ్ఛలవిడిగ తిరగడానికి ఆఖరికి మన పురాణాలు, మహా పురుషుల ఉదాహరణలు తీసుకుంటున్నం.అదీ మన ఉన్నత న్యయాలయం ద్వరా రవటం మన సిగ్గు చేటు.భగవంతుని లీలలు మనం విని తరించాలి కాని చేసి కాదు. కృష్ణుడు గొవర్ధనం ఎత్తాదు కాని మనం ఎత్తగలమ ? అలాంటప్పుదు శ్రీ కృష్ణ లీలలు అనుసరించటం ఎందుకు? ఉన్నతోధికరుల ఆలొచనె అఠొగతి పాలైనప్పుదు ఇంక సమాన్యమవుది సంగతి ఎమిటి? ఇంక ధర్మాచరన ఎక్కద దొరుకుండి ? న్యయలయంలొనా లెక నిత్యానందుని ద్యానమందిరం లొనా? పాస్చాత్యదెశాలు మన సంస్క్రుతి నెర్చుకునెలొపె మన సంస్క్రుతి అంతరించిపొతుంది. ఇంక ఆ దర్మాచరనకు ఆ భగవంతుదె రావలి.

హె కృష్ణ భరత మాతని వివస్త్రురాల్ని చెస్తున్నం వచ్చి రక్షించుకొ.

తస్మాత్ కారున్య భావెన రక్ష రక్షొ జనర్ధనః

చ్యవనప్రాష్

మనకు జీవితంలో ఎన్నో సంఘటనలు చాలా సాధారణంగా అనిపిస్తాయి కాని ఎప్పుడో ఏదో ఒక రోజున ఎలా ఉపయోగ పడుతాయో మనం గ్రహించలేము 


నేను ఏడవ తరగతి చుడువుతున్నప్పుడు మా తాత వేసవి సెలవులకు మా ఇంటికి వచ్చాడు, నన్ను చూసి ఎంతో మురిసిపోయాడు. నేను చాలా సన్నగా ఉన్నాను అంటూ మా నాన్న దెగ్గర మొర పెట్టాడు. "ఐతె ఏమీ చేయమంటావ్? " అని విసుకున్నాడు మా నాన్న. "పిల్లలకు చ్యవనప్రాష్ మంచిది, బలం వస్తుంది, రుచి కూడా బాగుంటుంది" అని మా తాత మా నాన్నను ఒప్పించాడు. మర్నాడు మా నాన్న ఒక చ్యవనప్రాష్ తెచ్చి ఇంట్లో పెట్టాడు. మా తాత మొహం లో వెయ్యి వాట్ల బల్బు వెలిగింది. 


నాకు రోజు స్కూల్ నించి రావటం తినటం పడుకోవటం అలవాటు. అదే అలవాటు తో ఆ రోజు కూడా త్వరగా పడుకున్న. 
"రాజు, రాజు" అంటూ మా తాత నా దెగ్గరికి వచాడు. 
"ఆ ఏంటి" అని విసుకున్నాను. "ఒరేయ్ కాస్త చ్యవనప్రాష్ తినరా" అని మా తాత స్పూన్ తో పెట్టబోయాడు 
"ఎహే పో" అని మా తాత ని నెట్టేస. "అలా కాదు నాన్న, ఒక్క స్పూన్ తినరా" అంటూ భ్రతిమిలడదు 
."నన్ను నిద్ర పొనేఏఏఏ" అని కేక వెస. ఐతె మా తాత "ఇదిగో చూడు నువ్వు తినక పోతే నేనే తినేస్త" అంటూ బెదిరించాడు. 
"ఆ నువ్వే తిను" అని ముసుకు పెట్టి పడుకున్న. మా తాత మెల్లగా ఒక్క స్పూన్ చ్యవనప్రాష్ నోట్లో వేసుకొని "రేపు చెప్తా నీ పని" అని వెళ్ళిపోయాడు. 


ఇలా కొన్ని రోజులు సాగింది, మా తాత నాకు చ్యవనప్రాష్ తినిపించాలి అని రావటం నేను వద్దు అనటం తను ఒక  స్పూన్ నోట్లో వేసుకోవటం. ఒక్క రోజు చ్యవనప్రాష్  ఐపాయింది, అప్పుడు మా నాన్న దెగ్గరికి వెళ్లి "ఒరేయ్ మోహన, రాజు కి చ్యవనప్రాష్ అయిపొయింది, ఇంకో బోటిల్ తీసుకొనిరా" అని అన్నాడు. అది విని నాకు తిక్క రేగింది, నా పేరు చెప్పుకొని మా తాత చ్యవనప్రాష్  లగించటం ఏంటి అని అనుకున్న. 


మర్నాడు ఒక్క బోటిల్ వచ్చింది నాకు నిద్దర సమయం కూడా వచ్చింది. మా తాత చ్యవనప్రాష్  తీసుకొని వచ్చాడు రాజు రాజు అంటూ. ఈ సారి  వెరైటీ గ "నేను చ్యవనప్రాష్  తింటాను" అని మా తాత దెగ్గర స్పూన్ తీసుకొని తినేస. కాని మా తాత మొహం లో ఏదో ఒక నిరాశ చూసా. తను ఆ రోజు చ్యవనప్రాష్ తినలేదు అనే బాధ తన మొహం లో కనిపించింది. అప్పుడు నాకు అర్థం ఐంది తనకు చ్యవనప్రాష్  అంటే చాల ఇష్టం అని. తను కావాలి అని అడిగితే మా నాన్న చ్యవనప్రాష్  తెస్తాడు కానీ అది చిన్న పిల్లల కోరిక లాగా ఉంటుంది ఏమో అని తను సిగ్గు పది అడగాలేడు అని అనిపించింది. వృద్ధులది పిల్లల మనస్తత్వం అని అంటారు కానీ మనసు పిల్లలదే ఐనా వయసు, అనుభవం వాళ్ళ ప్రవర్తనకు అడ్డు వేస్తుంది. పిల్లల మీద అతి జాగర్త చూపించే మనం పెద్దల పట్ల నిలక్ష్యం ఎందుకు? 


ఆనాటినుంచి నేను ఎప్పుడు మా తాత చ్యవనప్రాష్  ఇచినా వద్దు అనే వాడిని, మా తాత నన్ను బెదిరించినట్టు మభ్య పెట్టి "నువ్వు తినకపోతే చూడు నేనే తినేస్త" అంటూ ఆ చావంప్రాష్ ని ఆస్వాదించేవాడు. 
నేను డిగ్రీ పాస్ అయిన రోజు వెళ్లి మా తాతకు ఆ విషయం చెప్తే, "చూసావా చ్యవనప్రాష్  తిన్నందుకు నీ తెలివి ఎంత పెరిగిందో" అని అన్నాడు. "అవును తాత నిజంగా ఈ రోజు నాకు ఉన్న బుద్ధి చ్యవనప్రాష్  వల్లనే" అని నవ్వుకుంటూ వెళ్ళిపోయా. 


ఇప్పుడు నేను నా కొడుకు గదిలోకి వెళ్తున్నాను, చ్యవనప్రాష్  తీసుకొని. వాడు ఛీ కొడతాడు అనే నా నమ్మకం, కాని ఈ చ్యవనప్రాష్  వాడికి ఒక సంస్కారం నేర్పుతుంది అనే నా భావన.



పెగ్గు పై పెగ్గు

మందు తాగేటప్పుడు నేను అస్సలు రిస్కు తీసుకొను

మొన్న శుక్రవారం ఆఫీస్ నించి వచ్చా, మా ఆవిడా(సుందరి) వంట చేస్తుంది
నాకు వంటింట్లో చప్పుళ్ళు వినిపించాయి
నేను నెమ్మదిగా రూమ్లోకి వెళ్ల, నా బీరువా లో ఉన్న వ్హిస్కి బొట్టిల్ తీసా
ఫోటో లో వినాయకుడు నన్ను చూస్తున్నాడు,
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

పాత సింకు పై ఉన్న రాక లోంచి ఒక గ్లాస్ తీసా 
వెంటనే ఒక్క పెగ్గు వేసుకున్న, 
గ్లాస్ కడిగేసి మల్లి రాక లో పెట్టేస
వినాయకుడు నన్ను చూసి నవ్వు తున్నాడు

వంటింట్లో తొంగి చూసా, సుందరి సోర్రకాయ తరుగుతుంది 
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

నేను: శర్మగారి కూతురి పెళ్లి ఎంతవరకు వచ్చింది? 
సుందరి: ఏమో ఇంతవరకు ఏమీ కుదరలేదు, అంత ఆమె ఖర్మ

నేను మల్లి నా రూమ్లోకి వచ్చా, బీరువా లో చిన్న చప్పుడు
కానీ నేను ఏమీ చప్పుడు చేయకుండా బొట్టిల్ బయటికి తీసా
పై రాక నించి గ్లాస్ తీసా, వెంటనే ఒక్క పెగ్గు వేసుకున్న
గ్లాస్ కడిగేసి మల్లి రాక లో పెట్టేస
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

నేను: ఐనా శర్మగారి కూతురికి అంత వయసు లేదు లే
సౌందర్య: ఏమన్తున్నావ్? ఆమెకి ముప్పై ఏళ్ళు, ఒక ముసలి గాడిద లాగా ఉంది
నేను: ఆవన, మర్చి పోయా

నేను మల్లి రూం లో వెళ్ల,  బొట్టిల్ బయటికి తీసా
పై రాక లో నుంచి సోర్రకాయ బయటికి తీసా
వెంటనే ఒక్క పెగ్గు వేస
వినాయకుడు నన్ను చూసి నవ్వుతున్నాడు
రాక ని సోర్రకాయ పైన పెట్టేస, వినాయకుడి ఫోటో కడిగేస
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

వంట ఇంట్లో తొంగి చూసా
మా ఆవిడా సిన్కుని పొయ్యి మీద పెడ్తుంది

నేను: నీకు బుద్ధి ఉండ? శర్మగారిని గాడిద అంటావా? ఇంకోసారి అను నీ నాలుక కోసేస్త
సౌందర్య: నీకు పిచి ఎక్కింది, పాయి హాల్ లో కూర్చో

ఈ సరి మల్లి రూం లో వెళ్ల 
బొట్టిల్ ని సోర్రకయలోంచి తీసా
ఒక్క పెగ్గు వేస మల్లి గ్లాస్ సింక్ లో పెట్టేస
ఈ సరి ఫోటో లో మా ఆవిడా నవ్వుతుంది

వినాయకుడు ఇంకా వంట వండుతున్నాడు
ఎవ్వరికి తెలిదు ఎందుకు అంటే నేను రిస్కు తీసుకొను

వంటింటికి వెల్ల
నేను: ఐతె శర్మ కూతురు గాడిదని పెళ్లి చేసుకుంటుందా?
శకిల: ఛీ నోరు ముఇ, వెళ్లి మొహం కడుక్కో

నేను మల్లి వంటింకి వెళ్ల, బొట్టిల్ తీసా, ఏదో చప్పుడు, ఒక్క పెగ్గు వెస
తొంగి చేశా మా ఆవిడా పెగ్గు వేసుకున్తుందా లేదా అని,
ఎందుకు అంటే వినాయకుడు ఎప్పుడు రిస్కు తీసుకోడు

శర్మగారు ఇంకా వండుతున్నారు
ఫోటో లో మా ఆవిడా నన్ను చూసి నవ్వుతుంది
ఎవ్వరికి తెలిదు, ఎందుకు అంటే.........