Sunday, March 7, 2010

Preface

ఎన్న్తో కాలంగా నా స్నేహితుడు బ్లాగులు పట్ల ఆశక్తి చూపించేవాడు అలాగే తను కూడా ఏదో బ్లాగ్ మొదలు పెట్టుదాము అని చర్చించే వాడు, అయితే ఈ మధ్య లోనే నాకు దురద పుట్టి ఈ బ్లాగ్ ని మొదలు పెట్ట(మరి దురద పుట్టినప్పుడే కదా గోక్కోవాలి). తను ఇచిన సమాచార ప్రకారం ఈ బ్లాగ్ లో చాల హేమ హేమీలు ఉన్నారు అని తెలిసింది అందుకే హనుమంతుని ముందు కుప్పి గంతులు వేయకూడదు అనే విషయం మాత్రం మరువను. నా గురించి చెప్పుకోవటం నాకు  ఇష్టం ఉండదు అల అని దాచుకోవటం కూడా ఇష్టం ఉండదు, సో క్లుప్తంగా చెప్పాలి అంటే తెలుగు నా మాతృ భాస కాదు ఐన కానీ తెలుగు భాష అంతే నాకు మక్కువ ఎక్కువ. భావానికి భాష రూపం ఇవ్వటం చాల కష్టం అని అంటారు అలాగే మన భావాలకు అతి దెగ్గరగా వ్యక్త పరిచేది ఒక్క తెలుగు మాత్రమేనని నా అభిప్రాయం. నా ఈ ప్రయత్నాన్ని మీరు అందరు ఆదరిస్తారు అని ఆశిశ్తూ సెలవు తీసుకుంటున్నాను. బ్లాగ్ కి టాపిక్ వెతికి వస్తా, కంచికి కాదు లెండి.


1 comment: